అప్పట్లో సినిమా వాళ్ళ వ్యవహారాలు కాస్త ఆసక్తికరంగా ఉండేవి. అగ్ర నటుల మధ్య జరిగే విషయాలను జనాలు కాస్త ఆసక్తికరంగా చూసేవారు. ఇలా ఒక విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అదే కైకాల సత్యనారాయణ హీరోగా వచ్చిన సినిమా. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో డి రామానాయుడు సెక్రటరీ అనే సినిమాను చేసారు. ఈ సినిమా శత దినోత్సవ ఫంక్షన్ మద్రాసులోని వుడ్ ల్యాండ్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కినేని సినిమా హిట్ గురించి మాట్లాడారు. అనంతరం మాట్లాడిన కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ సురేష్ ప్రొడక్షన్స్ లో ఏఎన్ఆర్ ఏమిటి ? నేను హీరోగా చేసినా సినిమా హిట్ అవుతుందని చెప్పారని… అనగా… వెంటనే నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ సత్యనారాయణను ఉద్దేశించి హీరోగా చేయాలన్న నీ కోరిక నేను తీరుస్తాను అని అందరి ముందు మాట ఇవ్వడం జరిగిందట.
ఆ తర్వాత రామానాయుడు తన బ్యానర్లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సావాసగాళ్లు సినిమా నిర్మించారు. అయితే కైకాల హీరో అంటే బాగుండదు అని చాలా మంది చెప్పారట. ఎంత మంది చెప్పినా రామానాయుడు మాత్రం వినలేదు. అయితే గోదావరి నదీ తీరంలో ఒక ప్రేమ సీన్ ను… ఈ సినిమాలో హీరోయిన్ అయిన జయసుధ, కైకాల మధ్య షూట్ చేస్తే కైకాల పరిగెత్తుకుని వచ్చే సీన్ చూసి… రామానాయుడు ఆలోచనలో పడ్డారట. చివరకు ఆ సినిమా ఫ్లాప్ అయింది.