సాయి పల్లవి అద్భుతమైన ప్రతిభ ఉన్న నటి. దీనిని ఎవరూ కాదనలేరు. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో 2019లో సాయి పల్లవి రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్ ను వదులుకుంది.
మాములుగా బాలీవుడ్ హీరోయిన్స్ కు తరచుగా బ్రాండ్ డీల్స్ వస్తూ ఉంటాయి. బ్రాండ్ ఫేమ్ ను దృష్టిలో ఉంచుకుని హీరోయిన్స్ సంతకం చేస్తారు. కానీ సాయి పల్లవి అలా చెయ్యలేదు.
ఇదే విషయంపై గతంలో మాట్లాడుతూ… ఇది భారతీయ రంగు. తెలియని వారి వద్దకు వెళ్లి ఎందుకు తెల్లగా ఉన్నారని అడగలేం. ఆఫ్రికన్లు కూడా వారి స్వంత రంగును కలిగి ఉంటారు. కానీ వారు అందంగా ఉన్నారు.
ఇలాంటి పబ్లిసిటీ ద్వారా వచ్చే డబ్బుతో నేనేం చేస్తాను? నేను ఇంటికి వెళ్లి మూడు చపాతీలు లేదా అన్నం తింటాను. నా కారులో తిరుగుతాను. నాకు వేరే పెద్ద అవసరాలేమీ లేవు. నా చుట్టూ ఉన్న వ్యక్తుల ఆనందానికి నేను దోహదం చేయగలనా లేదా మనం చూసే ఈ ప్రమాణాలు తప్పు అని చెప్పగలనా అని మాత్రమే నేను చూస్తాను అంటూ చెప్పుకోచింది.
ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ ఈ యాడ్ విషయంపై మాట్లాడటంతో సాయి పల్లవి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల లవ్ స్టోరీ సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది.