టాలీవుడ్ లో శివ శంకర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగులో ఆయన ఫేమస్ అయ్యారో ఇతర భాషల్లో కూడా అంతే ఫేమస్ అయ్యారు. తెలుగుతో పాటుగా దాదాపుగా పది భాషల్లో ఆయన డాన్స్ మాస్టర్ గా పని చేసారు. అగ్ర దర్శకులకు ఒకప్పుడు ఆయన మొదటి ఆప్షన్ గా ఉండేవారు. ఎలాంటి పాట అయినా సరే ఆయన తీసుకుంటే సూపర్ హిట్ అన్నట్టే.
దాదాపుగా ఆయన 800 పైగా పాటలకు డాన్స్ మాస్టర్ గా వ్యవహరించారు. వాటిల్లో దాదాపుగా హిట్ అయ్యాయి. అయితే రెండేళ్ళ క్రితం కరోనా కారణంగా మృతి చెందారు. 74 ఏళ్ళ వయసులో ఆయనకు కరోనా సోకడం ఆ తర్వాత చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో మృతి చెందారు. అయితే ఇతర డాన్స్ మాస్టర్ లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటారు అనే టాక్ ఎక్కువగా ఉంది.
ఆయన మాట తీరు, ప్రవర్తన, నడక, నగలు వేసుకోవడం వంటివి ఆడవాళ్ళ మాదిరి ఉంటాయని కామెంట్స్ మనం చూస్తూనే ఉంటాం. తాను నగలు వేసుకోవడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. డాన్స్ మాస్టర్ అయిన తాను… అమ్మాయిలు రెడీ అయినట్టు అబ్బాయిలు ఎందుకు రెడీ కావద్దని భావిస్తాను అని అందుకే నగలు ధరిస్తాను అని వివరణ ఇచ్చారు. రాఘవేంద్ర రావు… తాను నగలు వేసుకుని వెళ్ళకపోతే అలా చూడలేను అన్నారని తెలిపారు.