చావు పుట్టుకలు అనేవి సహజం. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు. అయితే మనిషికి ప్రాణం పోసుకున్నప్పటి నుంచి చనిపోయే వరకు 16 కార్యక్రమాలను నిర్వహిస్తారు. శ్రీమంతం వేడుకలు, నామకరణం, పుట్టు వెంట్రుకలు ఇలా 16 కార్యక్రమాలు జరుగుతాయి. అయితే చనిపోయిన తర్వాత కూడా అతనికి సంబంధించిన కార్యక్రమాలను సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు.
దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్
ముఖ్యంగా చనిపోయిన తరువాత రెండు కాళ్ల బొటనవేళ్లను తాడుతో కట్టేసి పెడుతుంటారు. కాగా దాని వెనుక ఓ కారణం ఉందట. నిజానికి మనిషి చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు చాలా మందికి తెలియదు. కానీ పెద్ద వాళ్ళకి మాత్రం అప్పటి ఆచారాలు తెలుసు కాబట్టి… వాళ్లు చెప్పిన విధంగా ప్రస్తుతం ఉన్నవారు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి కార్యం వెనుక ఒక అర్థం పరమార్థం దాగి ఉందనేది పెద్దలు చెబుతున్న మాట.
సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ
చనిపోయిన తర్వాత శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తుంది. కానీ నిజానికి చనిపోయిన తరువాత వెళ్లిపోయిన ఆత్మ తిరిగి అదే శరీరం లోకి రావాలని, తిరిగి కుటుంబ సభ్యులతో ఉండాలని అనుకుంటుదట. అలా ఆత్మ తిరిగి మన శరీరంలోకి వచ్చినప్పుడు కాళ్లలో కదలికలు రాకుండా ఆ బొటనవేలును దారంతో కట్టి ఉంచుతారని పెద్దలు చెబుతూ ఉంటారు.
అలాగే సైన్స్ పరంగా కూడా ఓ విషయం చెబుతుంటారు… చనిపోయిన తర్వాత శరీరంలో చలనం ఉండదు. కాబట్టి శరీర అవయవాలకు రక్త ప్రసరణ జరగక బిగుసుకుపోతాయి. అలాంటప్పుడు కాళ్లు రెండు పక్కకి పోవడం వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అందువల్లే కాలి బొటనవేలు చేతి బొటన వేలును కూడా దారంతో కట్టడంవల్ల దహన సంస్కారాలు చేయడానికి కూడా సులభంగా ఉంటుందట. ఆచారాలు అలాగే సైన్స్ రెండు విధాల కూడా దారంతో కట్టడం వెనుక ఉన్న రహస్యం, అర్థం, పరమార్థం ఇదే.