సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ వస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోతారు. అలా ప్రేక్షకులకు మంచి జోడీ అనిపించుకున్న వారు చాలా తక్కువ. వారిలో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కూడా ఉన్నారు. ఒకానొక టైంలో ఈ ఇద్దరూ స్టార్డం లో కొనసాగారు. మంచి రెమ్యూనరేషన్ కూడా తీసుకునేవారు. విజయశాంతి అయితే హీరోలకు సమానంగా తీసుకునేది.
ప్రతిఘటన, కర్తవ్యం వంటి సినిమాలు విజయశాంతికి ఇండస్ట్రీలో ఓ రేంజ్ తీసుకొచ్చాయి. ఒక్క హీరోయిన్ పాత్రలనే కాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా అదరగొట్టేది ఈ లేడీ అమితాబ్. ఒసేయ్ రాములమ్మ సినిమా లో అయితే విజయశాంతి విశ్వరూపం చూపించింది.
సుకుమార్ గడ్డం వెనుక అసలు కథ ఇది!
ఆమె నటన చూసి ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సైతం వనికిపోయారు. అయితే హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు విజయశాంతి. తెలంగాణ ఉద్యమం అంటూ బయటకు వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ ని స్థాపించారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు.
చిరు ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్…మీకు తెలుసా ఈ విషయం!!
ఇదిలా ఉండగా విజయశాంతి కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి తోనే ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో 19 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటిది ఈ ఇద్దరూ 20 ఏళ్ళు మాట్లాడుకోలేదట. దానికి కారణం తెలంగాణ ఉద్యమ సమయంలో సినిమా పరిశ్రమ కు సపోర్ట్ అడిగితే ఎవరూ స్పందించలేదట. సహాయం చేయడం తర్వాత కనీసం స్పందించి ఉంటే బాగుండేదని విజయశాంతి చాలాసార్లు అప్పట్లో మాట్లాడారు. ఆ సమయంలోనే చిరంజీవి తో మాట్లాడటం కూడా మానేసిందట విజయశాంతి. ఆ తరువాత సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తో మొదటిసారి మాట్లాడారు విజయశాంతి.