భారతీయ సంప్రదాయం ప్రకారం హిందూ ధర్మాన్ని పాటిస్తున్న ప్రతి మహిళ కూడా నుదుటున బొట్టు పెట్టుకుంటారు. అయితే ఒక్కోరు ఒక్కో రకంగా ఈ బొట్టు పెట్టుకుంటారు. నామం, విభూతి రేఖలు, కుంకుమ, గంధం ఇలా రకరకాలుగా నుదుట బొట్టు పెట్టుకుంటారు. అయితే దీనివెనుక చాలా రహస్యాలు ఉన్నాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
బొట్టు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ బొట్టు పెట్టుకుంటే… సూర్యకిరణాలు ఆ బొట్టు ద్వారా ప్రసరించి నూతనోత్తేజాన్ని ఇస్తుందట. డి విటమిన్ ను తొందరగా శరీరం తీసుకునే శక్తి కూడా ఇస్తుందట.
ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి చేసిన చిన్న తప్పు…. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
మహిళలు ముఖ్యంగా పెళ్లైన ముత్తైదువులు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. ఐదవతనంకు ఈ బొట్టు చిహ్నంగా నిలుస్తుంది. కాబట్టి పెళ్లి అయిన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాకుండా శుభ కార్యాలు చేయడానికి అర్హత లేని వారిగా చెబుతుంది. ఎవరినైనా ఆహ్వానించడానికి ముందు బొట్టు పెట్టే ఆహ్వానిస్తారు. అంత ప్రాముఖ్యత ఉంది ఈ బొట్టు లో.
ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలు తో పెట్టుకుంటే ఆయువు, సంపద లభిస్తుంది. అలాగే చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. బొటన వేలితో పెట్టుకుంటే భుక్తి కలుగుతుంది. జ్ఞాపకశక్తికి ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య ఈ బొట్టు పెట్టుకుంటే దాని ద్వారానే సూర్యకాంతి శరీరానికి లోపలికి ప్రసవించి ఉత్తేజపరుస్తుందట. బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ కూడా ఇస్తుందట. శక్తిని కోల్పోకుండా కాపాడుతుందట. అలాగే అప్పుడప్పుడు విభూతి రాయటం చాలా మంచిదట. ఇది మన పెద్దలు పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకమైనది.
సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?