కొన్ని చిన్న విషయాలకు కూడా మనకు బద్ధకం బయటకు వస్తు ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పనులకు మనం వెళ్లి నిలబడాలి అంటే మరీ బద్ధకం. మన ఇంట్లో జరిగినట్టు అక్కడ కూడా పని జరగాలని కోరుకుంటూ ఉంటాం. అలా మనం చిన్న విషయాలకు మోసపోయేవి ఒక మూడు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
Also Read:కళ్ళ ముందే జరిగే ఈ మూడు మోసాలు గ్రహిస్తున్నారా…?
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే సాధారణంగా మనం డైరెక్ట్ గా వెళ్తే ఈజీగానే పని జరుగుతుంది. కాని బ్రోకర్ ద్వారా మాత్రమే అయ్యే పని అనే ఆలోచనలో ఉండి ఆరేడు వందల పనికి వేలు ఖర్చు చేస్తూ ఉంటాం. దాని కోసం కొన్ని డ్రైవింగ్ స్కూల్ బ్రోకర్లు 4 నుంచి 5 వేలు వరకు తీసుకుంటారు. ఆర్టీవో కార్యాలయాల్లో చాలా చోట్ల బ్రోకర్ల దందా నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైవింగ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా లేకపోయినా సరే వాళ్ళ ద్వారా వెంటనే లైసెన్స్ వస్తుంది.
ఇన్సూరెన్స్ బ్రోకర్లు: కార్ కొనే సమయంలో బీమా అనేది కచ్చితంగా చేయించుకోవాలి. అయితే డైరెక్ట్ గా బీమా కంపెనీతో మాట్లాడితే కళ్ళకు అద్దుకుని బీమా చేస్తారు. కాని అది కూడా మనకు బద్ధకంగానే ఉంటుంది. బీమా కంపెనీలకు కూడా బ్రోకర్ లు ఉంటారు. వాళ్ళు కారు షో రూమ్ లలో ఉండే కొందరు వ్యక్తులతో లింక్ పెట్టుకుని బీమా చేయిస్తారు. దీనితో మన జేబుకి పది వేల పైగానే చిల్లు పడుతుంది. అయితే కారు కొనే మోజులో వాటిని పట్టించుకోరు.
మ్యారేజ్ సర్టిఫికేట్: వాస్తవంగా మాట్లాడితే దీనికి అయ్యే ఖర్చు 500 లోపే ఉంటుంది. కాని బ్రోకర్ లు ఉండి కచ్చితంగా రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆన్లైన్ లో కట్టే ఫీజు 210 రూపాయలు మాత్రమే. ఇక నోటరీ లాంటివి ఏమైనా చేయించాల్సిన అవసరం ఉంటే దానికి అయ్యే ఖర్చు ఒక వంద రూపాయలు లేక్కేసుకున్నా సరే 300 నుంచి 350 అవుతుంది. కాని రిజిస్టార్ ఆఫీసుల్లో ఉండే బ్రోకర్ల దెబ్బకు 2000 వేల వరకు ఖర్చు అవుతుంది. పేపర్ లో వివరాలు పూర్తి చేసుకోలేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఇలా డబ్బులు వృధా చేస్తున్నారు. వాళ్ళు చేసేది తప్పు కాకపోయినా అధికారులకు వీళ్ళ నుంచి లంచం వెళ్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి.
Also Read:చేత్తో తోస్తే పడిపోయే గోడలు.. ! ఈ నిర్మాణాలు ఎందుకంట..?