తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జయం. సదా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించారు. ఇకపోతే ఈ సినిమాలో సదా చెల్లెలుగా ఒక అమ్మాయి నటించింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరూ గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఆమె పేరు యామిని శ్వేత. కానీ ఆమె పేరు చెప్తే అంతగా గుర్తు పట్టలేరు. కానీ జయం సినిమాలో సధా చెల్లెలు అంటే ఖచ్చితంగా గుర్తుపడతారు. అంతలా యామిని శ్వేత కు గుర్తింపును తీసుకొచ్చింది ఈ సినిమా.
యామిని శ్వేత తల్లి విజయలక్ష్మి కూడా ఒక ఆర్టిస్ట్. ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించింది. జయం సినిమా కన్నా ముందు యామిని చేత కొన్ని సీరియల్స్ లో నటించింది. మొదట గా సీతామాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం సినిమా ఆడిషన్స్ ప్రకటన వచ్చింది. ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయింది యామిని శ్వేత. ఆ తర్వాత ఉత్సాహం అనగనగా ఒక కుర్రాడు వంటి సినిమాలు చేసినా అవి అప్పటికి అంతగా పేరు తీసుకురాలేకపోయాయి. జయం సినిమాతో మాత్రం నంది అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి యామినికి 20 సంవత్సరాలు.
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఏంటో తెలుసా ?
అయితే ఇప్పుడు యామిని శ్వేత ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న విషయాలు చాలా మందికి తెలియదు. కానీ యామిని శ్వేత సినిమాలకు దూరం అయ్యాక విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం లో జాయిన్ అయ్యి సెటిలైంది. పెళ్లి కూడా చేసుకుని స్థిరపడింది. ఆమెకి ఒక కూతురు కూడా ఉంది. చదువుకునే సమయంలోనే యామిని శ్వేత కు చాలా ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె తిరస్కరించిందట. అందులో నచ్చావులే సినిమా కూడా ఒకటిగా చెబుతుంటారు. అలాగే తనకు వచ్చిన నంది అవార్డు ప్రైజ్ మనీని కూడా వికలాంగుల ఆశ్రమానికి దానం చేసింది యామిని శ్వేత.
శ్రీకాంత్ అంత ధైర్యం చేశాడా ? ఊహ తల్లిదండ్రుల ముందే ప్రపోజ్ చేసేశాడట!!
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది యామిని. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.