శానిటైజర్ తాగడం వల్ల మత్తు వస్తుందని కొంతమంది శానిటైజర్ తాగుతున్నారు. శానిటైజర్ తాగడం వల్ల మైకం రాదని మెదడుపై శరీర అవయవాలపై ప్రభావం చూపించి ప్రాణాలు కోల్పోతారని డాక్టర్ చైతన్య బట్టు తెలిపారు. ఏపీ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో కురిచేడు, పామూరు, కర్నూల్ తిరుపతి ప్రాంతాల్లో మద్యానికి బానిసలైన కొంతమంది శానిటైజర్ తాగడం బహుశా మొదటి కేసులుగా పరిగణించాలన్నారు డాక్టర్ చైతన్య బట్టు .అవగాహన లేకపోవడం ప్రభుత్వం నుంచి ప్రచారం లేకపోవడం తో శానిటైజర్ తాగి చనిపోతున్నారని తొలివెలుగు ఇంటర్వ్యూ లో ఆయన తెలిపారు. శానిటైజర్ తాగడం వల్ల జరిగే పరిణామాలు… వాడాల్సిన పద్దతులపై డాక్టర్ చైతన్య బట్టు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే కింది ఉన్న ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.