ఏ ఆపద వచ్చినా నువ్వే దేవునివని ఆ దేవుని కన్నా ముందు డాక్టర్ ను మొక్కుతారు ప్రజలు. కానీ అలాంటి డాక్టరే కామవాంఛతో చూస్తుంటే ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్దం కాని పరిస్థితి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న డా. నర్సింగ్ చౌహాన్ ట్రైనీ నర్సింగ్ విద్యార్థినిని లైంగికంగా తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వినిపించాయి. ఇదే తరహాలో మీడియాలో వచ్చిన కథనాలకు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. కె.రమేష్ రెడ్డి స్పందించారు. డా. చౌహాన్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.
నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పూర్తి వివరాలు సేకరించి.. సమర్పించాలని సంగారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ ను ఆదేశించారు అధికారులు. ఉత్తర్వులు వెలువడే వరకు డా. రామకృష్ణ రాజుకు ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు అప్పగించారు అధికారులు.