గాంధీ ఆసుపత్రిలో సస్పెండైన డాక్టర్ వసంత్ హల్ చల్ చేశాడు. తనను అన్యాయంగా బలిపశువును చేశారంటూ ఆవేదనతో ఆసుపత్రి ప్రాంగణంలో పెట్రోల్ బాటిళ్లను వెంటతెచ్చుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పొట్ట చుట్టూ పెట్రోల్ బాటిళ్లు పెట్టుకొని, లైటర్ పట్టుకొని మూడు గంటల పాటు హంగామా చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, డాక్టర్ వసంత్ వినకపోవటంతో బలవంతంగా తీసుకెళ్లారు.
కరోనా వైరస్ పరీక్షల సమయంలో… కరోనా వైరస్ సోకిందని తప్పుడు ప్రచారం చేశారంటూ డాక్టర్ వసంత్ సహా ముగ్గురిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కానీ డాక్టర్ వసంత్ మాత్రం తనకు సంబంధం లేని అంశంలో ఇరికించారంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
డాక్టర్ వసంత్‌ను కాపాడిన పోలీసులకు సీపీ అంజనీ కుమార్ నజరానా ప్రకటించారు.