చెన్నయ్ : యువ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కుమార్‌కు అమెరికన్ వెస్ట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శనివారం చెన్నైలో ఆల్ ఇండియా ఎఛీవర్స్ అండ్ రీసెర్చ్ అకాడమీ (న్యూ ఢిల్లీ) ఆధ్వ ర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు జస్టిస్ స్వామి దొరై చేతుల మీదుగా పుట్టగుంట గౌరవాన్ని అందుకున్నారు. లయనిజంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు యూనివర్సిటీ సతీష్ కుమార్‌కు డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించిoది. యువ పారిశ్రామికవేత్తగా తన రోజువారీ వ్యాపార వ్యవహారాల్లో సతమతమవుతూ కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని సేవా కార్యక్రమాల కోసం వెచ్చించడం పుట్టగుంట గొప్పతనంగా అభివర్ణించారు. పుట్టగుంట స్ఫూర్తితో నేటి తరం యువకులు ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని పిలుపునిచ్చారు. తనకీ గౌరవం దక్కడంపై ‘పుట్టగుంట’ తొలివెలుగుతో మాట్లాడుతూ ఈ డాక్టరేట్ తన బాధ్యత మరింత పెంచిందని అన్నారు. మరిన్ని సేవా కార్య క్రమాలు చేపట్టి సమాజానికి ఒక రోల్‌మోడల్‌గా ఉండేందుకు కృషిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలోయూనివర్సిటీ, అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.