లింగ నిర్ధారణే నేరం అని. అలాంటిది లింగ నిర్ధారణే కాదు పిండాన్ని కడుపులోనే చిదిమేస్తూ కాసులు వెనకేసుకునే వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించడానికి కొందరు, పై చదువుల కోసం అని పట్టణానికి వచ్చి, పెడదారి పట్టిన యువత ఈ క్లినిక్‌కు రెగ్యూలర్‌గా వస్తుంటారు. లింగనిర్ధారణ, అబార్షన్స్ చేయటమే ఆ క్లినిక్ పని.
కొంతకాలంగా కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ అబార్షన్ల దందా గుట్టుగా సాగుతోంది. శ్రీసాయి క్లినిక్ పేరుతో రాధ అనే మహిళ ఈ క్లినిక్ నడుపుతోంది. ఈ క్లినిక్ భాగోతం తెలిసిన కొందరు స్థానికులు పోలీసులకు, వైద్యాధికారులకు సమాచారం అందించటంతో గుట్టురట్టయింది.
క్లినిక్‌లో దాడికి ముందువరకు అబార్షన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అబార్షన్ చేయటంతో రక్తంతో కూడిన మృతపిండం, 2 లక్షల విలువ ప్రామిసరీ నోట్లు, 66వేల నగదు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. వీటితో పాడు పుస్తెలతాడు, మైబెల్స్, పాస్‌పోర్ట్స్, పెన్‌డ్రైవ్స్, ఓటరీ ఐడీ కార్డ్స్ కూడా లభ్యమయ్యాయి.
కొంతకాలంగా ఈ దందా సాగుతోందని, ఇందులో కొందరు వైద్యాధికారులకు కూడా వాటాలు వెళ్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.