వికారాబాద్ జిల్లా పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.అత్యవసర సేవల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డాక్టర్లు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఒక వ్యక్తి తన కూతురుకు ఫిట్స్ వచ్చిందని ఆస్పత్రికి తీసుకొస్తే డ్యూటీ డాక్టర్ పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
గట్టిగా అడిగితే ఆస్పత్రి నుండి వెళ్ళిపోతానని డాక్టర్లు బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. డ్యూటీ డాక్టరే పట్టించుకోకపోతే తమ ప్రాణాలకు దిక్కెవరని వాపోతున్నారు.
అంతేగాకుండా.. ఆసుపత్రిలో కేవలం నర్సులు మాత్రమే పని చేస్తున్నారని…డాక్టర్ కనీసం చెయ్యి పట్టి కూడా చూడడం లేదని ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.