సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. ఇక యాక్టర్ గా మారడానికి ప్రయత్నాలు చేసే వారిలో డాక్టర్లు కూడా ముందు వరుసలో ఉండే వారు. ఇక మన తెలుగులో యాక్టర్ లు గా మారిన డాక్టర్లు ఉన్నారు. ఇప్పటికీ అవకాశాలతో దూసుకుపోతూ అలరిస్తున్నారు. తెలుగు యాక్టర్స్ గా మారిన డాక్టర్స్ లిస్టు చూస్తే…
Also Read:ఇండియన్ క్రికెట్ గతిని మార్చింది ఎవరూ…?
రాజశేఖర్
వైద్య వృత్తిలో ఉన్నా సరే సినిమాల మీద ఉన్న ఆసక్తి తో ఆయన సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి యాంగ్రీ యాంగ్ మ్యాన్ గా మంచి సినిమాలు చేసారు. పోలీసు పాత్రలతో అలాగే యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
అదితి
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. కానీ ఆమె అప్పటికే డాక్టర్. ముంబయిలోని గ్రాంట్ మెడికల్ కాలేజీ నుండి ఎంబిబిఎస్ పూర్తి చేసారు.
రవి ప్రకాష్
ఒకపక్క వైద్యుడిగా సేవలు అందిస్తూనే సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుని మంచి మంచి పాత్రలు చేసారు. నెగటివ్ పాజిటివ్ రోల్స్ తో ఆకట్టుకుంటున్నారు.
సాయి పల్లవి
ఫిదా సినిమాతో తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది సాయి పల్లవి. జార్జియాలోని బిసిబీ స్టేట్ మెడికల్ యూనివర్సిటి నుండి ఆమె ఎంబిబిఎస్ చేసి సినిమాల మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు.
శివ ప్రసాద్
సినిమాల్లో రాజకీయాల్లో రాణించారు శివ ప్రసాద్. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆయన ఎంబిబిఎస్ డిగ్రీ చేసి నాటకాల మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు.
భరత్ రెడ్డి
ఎన్నో సినిమాల్లో పాజిటివ్ నెగటివ్ రోల్స్ చేసిన భరత్ రెడ్డికి సినిమాల్లో అవకాశాలు అనేది పార్ట్ టైం మాత్రమే. అర్మేనియాలోని ఎరెవన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో కార్డియాలజిస్టుగా పని చేస్తున్నారు.
Also Read:ధాన్యం కొనుగోళ్లపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం..!