బీసీజి టీకా విధానం లేని దేశాల్లో కరోనా మరణాలు పది రెట్లు ఎక్కువ సంభవించాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.178 దేశాల డేటాను విశ్లేషించిన అమెరికా, బ్రిటన్ దేశాల వైద్య పరిశోధకులు ఈ నివేదికను బయట పెట్టారు.
బీసీజి, టీబీ అంటే క్షయ వ్యాధి నివారణ కోసం ఇచ్చే టీకా.ఇప్పటికీ చాలా దేశాలలో ముఖ్యంగా అమెరికా, ఇటలీ మరియు హాలండ్ వంటి అనేక ధనిక దేశాల్లో బీసీజి టీకా విధానం అంటూ లేదు. అందుకే అమెరికా , ఇటలీలో కరోనా కేసులు మృతుల సంఖ్య దారుణంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ అధ్యయనం 178 దేశాల్లో మార్చి 9 నుండి 24 మధ్య 15 రోజుల పాటు కరోనా కేసులు మరణాలపై నిర్వహించారు. బిసిజి టీకా ఉన్న దేశాలలో కరోనా వైరస్ ఒక మిలియన్ ప్రజల్లో అంటే 10 లక్షల మందిలో 38.4 మంది మాత్రమే కరోనా సోకుతుంది. బీసిజి టీకా విధానం లేని దేశాల్లో 10 లక్షల మందిలో 358 .4 మందికి కరోనా వస్తోందట. అదే విధంగా మరణాల సంఖ్యను పరిశీలిస్తే బిసిజి టీకా ఉన్న దేశాల్లో 10లక్షల మందిలో,4 గురు మాత్రమే చనిపోతున్నారు.లేని దేశాల్లో 40 మంది చనిోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనం చేసిన 178 దేశాల్లో అసలు 21 దేశాల్లో బిసిజి టీకా ప్రోగ్రాం లేనే లేదు. మరో 26 దేశాల్లో అస్పష్టమైన విధానంతో వెళ్తున్నాయి.అందుకే కరోనా కేసులు ఆయా దేశాల్లో ఎక్కవ ఉన్నాయంటున్నారు.
ఈ మధ్యే న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, జపాన్ మరియు బ్రెజిల్ వంటి సార్వత్రిక టీకా విధానం ఉన్న దేశాలు ఇటలీ , అమెరికా వంటి దేశాలు కరోనా వైరస్ చేత ఎక్కువగా ప్రభావితం అయ్యాయని పేర్కొంది.