నట సింహం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునలు ఒకప్పుడు బడా హీరోలు. ఒకప్పుడు వీరి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసేవి. ప్రస్తుతం కుర్ర హీరోలు ఉన్నప్పటికీ.. పెద్ద హీరోల జోష్ ఏ మాత్రం తగ్గలేదు. అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటున్నారు. అయితే వీరిలో నెంబర్ 1 హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెబుతారు. ఎందుకంటే ఆయన సృష్టించిన
ప్రభంజనం మామూలుగా లేదు.
కానీ చిరు కంటే ముందే బాలయ్య కొన్నాళ్ల పాటు నెంబర్ 1 హీరోగా కొనసాగే వారు. కానీ ఆ తర్వాత సుమన్ వచ్చి అతన్ని డామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో చిరు వచ్చి సుమన్ ను, బాలయ్య ను వెనక్కి నెట్టారు. సుమన్ త్వరగానే ఫేడౌట్ అయిపోగా బాలయ్య మాత్రం నెంబర్ 2ప్లేస్ లో కొనసాగుతూ వచ్చారు. ఇక వెంకీ, నాగ్ లు 3,4 ప్లేసుల్లో కొనసాగేవారు. అయితే పవన్, మహేష్, ప్రభాస్ వంటి నెక్స్ట్ జనరేషన్ మొదలయ్యాక వీరి హవా తగ్గింది.
చిరంజీవి కొన్నాళ్ళు నెట్టుకొచ్చినా ఆ తర్వాత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వడంతో.. పవన్, మహేష్, చరణ్ లు పుంజుకున్నారు. అప్పటి నుండి సీనియర్ స్టార్ హీరోలంతా వెనుకపడ్డారు. అయితే ఈ బడా హీరోలు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వీరిలో బాలయ్య బాబు మాత్రం అన్ స్టాపబుల్ గా పెద్దగా బ్రేకులు ఇవ్వకుండా కంటిన్యూ అవుతున్నారు. చిరు రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా లాభం లేదు. ఖైదీ నెంబర్ 150, సైరా, ఆచార్య వంటి చిత్రాలు చిరుని నిరాశలో ముంచేశాయి. కానీ శుక్రవారం రిలీజ్ అయిన ‘గాడ్ ఫాదర్’ మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం ప్రేక్షకుల్లో కాస్త ఆశని కలిగేలా చేశాయి.
అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాలయ్య బాబుదే హవా కొనసాగుతోంది. ఎందుకంటే గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు రూ.16.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక నాగార్జున ఘోస్ట్ అయితే రూ.2.42 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలతోనే వస్తున్నాడు. సోలోగా వెంకీ నటించిన ఏ చిత్రం కూడా మొదటి రోజు రూ.10 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయలేకపోయింది. అయితే బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం మాత్రం మొదటి రోజు రూ. 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.
ఈ రకంగా చూస్తే సీనియర్ స్టార్ హీరోల్లో ఒక్క బాలయ్యకి మాత్రమే బాక్సాఫీస్ స్టామినా ఉందని స్పష్టమవుతుంది. అలా అని బాలయ్య మిగిలిన డైరెక్టర్లతో చేసే సినిమాలు ‘అఖండ’ రేంజ్ వసూళ్లను సాధిస్తున్నాయి అని చెప్పలేం. కానీ బోయపాటి కాంబోలో ఆయన సినిమా వస్తే మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.