వేసవి కాలం వచ్చింది అంటే చాలు చెమట వాసన మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బయటకు వెళ్ళాలి అంటే ఒంటి నిండా పౌడర్ రాసుకోవడమో లేక మరేదైనా సేంట్ కొట్టుకోవడంతో చేయాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఆ వాసన చాలా భయంకరంగా ఉంటుంది. ఇక మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు లేవు అంటే మాత్రం మన శరీరం నుంచి వచ్చే వాసన చాలా భయంకరంగా ఉంటుంది.
Also Read:అతి వేగం.. మద్యం మత్తే ప్రమాదానికి కారణం..!
ఇక శరీరం నుంచి వచ్చే వాసన తగ్గాలి అంటే ఏం చేయాలో ఒకసారి చూద్దాం. కచ్చితంగా రెండు పూటలా స్నానం చేయాల్సి ఉంటుంది. మసాలాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి చాలా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. వీలైతే మానేయడం కూడా మంచిది అని చెప్పాలి. రోజూ రాత్రి పూట పళ్ళు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా నీరు తాగే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఇక ప్రతీ రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. ఒక్కోసారి 250 నుంచి 500మి.లీ తాగడం మంచిది. ఇలా చేస్తే శారీరక దుర్గంధం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. వీలుంటే 15 రోజులు మంచి ప్రకృతి ఆశ్రమం లో చేరాలి. శరీరానికి ఎటువంటి ఆహారం ఇస్తున్నామో అటువంటి వాసనలు మన చెమట ద్వారా చర్మం రిలీజ్ చేస్తుంది. స్నానం చేసే నీళ్ళలో పొద్దున &.సాయంత్రం నిమ్మకాయ బకెట్ లో పిండి స్నానం చేయడం వంటివి మంచిది.
Also Read:సీఎం పదవికి రేటు కట్టే పార్టీ బీజేపీ..!