సోషల్ మీడియాలో ఉండటం, సోషల్ మీడియాలో తమ గురించి ఎన్నో విషయాలు పంచుకోవడం ప్రముఖులు చేసే పని. అమెరికా అధ్యక్షుడు అయినా భారత ప్రధాని అయినా… పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయినా దాదాపుగా తమ ట్విట్టర్ ఎకౌంటు లో అనేక విషయాలు చెప్తూ ఉంటారు. దీనితో ట్విట్టర్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది అనే చెప్పాలి.
అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటీ అంటే… టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఎకౌంటు లేదట. కాని ఆయన పేరుతో ట్విట్టర్ ఎకౌంటు ఒకటి రన్ అవుతుంది. అది కూడా వెరిఫైడ్ ఎకౌంటు. దానికి 76.1 మిలియన్ల మంది ఫాలోవర్లు కూడా ఉండటం విశేషం. అందులో అనేక విషయాలను ఆయన పంచుకుంటూ వస్తున్నారని భావించారు. కాని ఆయన డ్రీం ప్రాజెక్ట్ అయిన స్పేస్ ఎక్స్ అధికారిక ట్విట్టర్ ఖాతా ఒక ప్రకటన చేసింది.
కంగారు పడకండి ఆ ట్వీట్ చేసింది ఇప్పుడు కాదు. 13 ఏళ్ళ క్రితం చేసిన ట్వీట్ అది. ఎలాన్ మస్క్ కు నిజంగా ట్విట్టర్ ఎకౌంటు లేదని ఎవరైనా అది ఎలాన్ మస్క్ ఖాతా అని చెప్పుకుంటే మాత్రం కచ్చితంగా ఫ్రాడ్ అని అప్పట్లో ప్రకటించింది. ఈ ట్వీట్ ను స్పేస్ ఎక్స్ 2009 ఏప్రిల్ 30 న చేసింది. అసలు ఆయనకు ట్విట్టర్ ఖాతా ఉందా లేదా అనేది స్పష్టత రాలేదు. అయితే తాజాగా దీనిపై ఆయన రిప్లై ఇచ్చారు. తన పేరుని ఎవరో లాక్కుంటే తాను స్పేస్ ఎక్స్ నుంచి ట్వీట్ చేసాను అని ఎలాన్ మస్క్ చెప్పారు. చిన్న చిన్న విషయాలతో తాను ట్విట్టర్ నుంచి వెళ్ళినట్టుగా కామెంట్ చేయడం గమనార్హం.
Hey @elonmusk are you real? pic.twitter.com/WSAaE0LCkf
— Tesla Silicon Valley Club (@teslaownersSV) March 2, 2022
Advertisements