మైక్రోవేవ్ ఓవెన్ లు ఈ మధ్య కాలంలో ప్రతీ ఇంట్లో కనపడుతున్నాయి. అవి వాడటం అనేది అత్యవసరంగా మారింది అనే చెప్పాలి. అయితే వీటితో అనార్ధాలు ఎక్కువగా ఉన్నాయనే మాట వాస్తవం. వీటి కారణంగా రేడియేషన్ వస్తుందనే మాట మనం వింటాం. అసలు వస్తుందా లేదా అనేది చూద్దాం. మనం తినే ఆహార పదార్థాలన్నిటిలోనూ తేమ ఉంటుంది.
Also Read:కరోనా వ్యాప్తి.. భారీగా కేసులు నమోదు
మైక్రోవేవ్ తరంగాలలో ఉన్న శక్తి ఈ నీటి అణువులని కంపించే విధంగా చేస్తుంది. ఈ కంపనంతోనే వేడి బయటకు వస్తుంది. ఆ వేడికి ఆ పదార్థం ఉడుకుతుంది. అంత వరకే గాని అ విధంగా ఉడికిన ఆహారంలో మైక్రోవేవ్స్ ఉండవు. బియ్యాన్ని మంట మీద పెట్టి వండిన సందర్భంలో ఇదే జరుగుతుంది. మంటలోని వేడికి నీళ్ళు సలసల కంపిస్తాయి. ఉడికిన అన్నం తిన్నప్పుడు నోరు కాలితే అది వేడిగా ఉన్న అన్నం ప్రభావమే.
అంతే గాని పొయ్యిలో మంట ప్రభావం కాదు. మంట నుండి వేడితో పుడుతుంది. బొగ్గుల నుండి పుట్టొచ్చు, సహజ వాయువుని మండించగా పుడుతుంది. విద్యుత్ పరికరాల నుండి పుడుతుంది. చివరిగా మైక్రోవేవుల నుండి వస్తుంది. అంతే గాని రేడియేషన్ ప్రభావం ఉండదు అని నిపుణులు అంటున్నారు. మైక్రోవేవ్ లు ఎక్కువగా వాడమని కాదు గాని జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం ఉత్తమం.
Also Read:కల్తీసారాకు తొమ్మిది మంది బలి…!