టాలీవుడ్ లో నరేష్, పవిత్రా లోకేష్ వ్యవహారం పెద్ద చర్చలకు దారి తీస్తుంది. వీళ్ళు ఇటీవల పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో అది మరింత సంచలనం అయింది. ఈ తరుణంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం అయింది. అసలు ఆమె ఏమన్నారు, ఆ ఇంటర్వ్యూలో ఆమె చేసిన సంచలన ఆరోపణలు ఏంటీ అనేది చూద్దాం. ఇద్దరి మధ్య దాదాపుగా 20 సంవత్సరాల గ్యాప్ ఉందన్నారు.
తన వయస్సు కంటే 12 సంవత్సరాలు వయస్సు తక్కువని చెప్పి సీనియర్ నరేష్ పెళ్లి చేసుకున్నాడని అన్నారు. పెళ్లికి ముందే నిజం తెలిసిందని నన్ను మిస్ అయిపోతానని చెప్పి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. నరేష్ జాతకం వేణుస్వామికి జాతకం చూపించగా ఆయన ఈ మ్యారేజ్ సెట్ కాదని చెప్పారన్నారు. 498ఏ కేసు పెట్టాలని మా లాయర్ సూచించారని రమ్య రఘుపతి వివరించారు.
సోషల్ మీడియాలో చెబుతున్నట్టు తాను భరణం తీసుకున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసారు. పెళ్లైన ఏడాది తర్వాత నరేష్ కు నాకు బాబు పుట్టాడని ఆమె గుర్తు చేసుకున్నారు. నరేష్ కు రఘువీరారెడ్డి గారి నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదని, పెళ్లికి ముందు నరేష్ లేచిపోదామని చెప్పారని అలాగే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందామని నరేష్ కోరగా నేను ఒప్పుకోలేదని ఆమె తెలిపారు.