స్కూల్ కు వెళ్ళకుండా తప్పించుకోవడానికి చిన్న పిల్లలు కొందరు గ్రామాల్లో చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటూ ఉంటారు. అలా చేస్తే జ్వరం వస్తుంది కాబట్టి స్కూల్ మానేయవచ్చు అని. అయితే ఈ విషయంలో కొందరు సక్సెస్ అయితే కొందరు ఫెయిల్ అవుతూ ఉంటారు. అసలు అది ఎంత వరకు నిజం అనేది చాలా మందికి తెలియదు. అసలు అలా ఎందుకు జ్వరం వస్తుందో కూడా తెలియదు.
Also Read:పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండిరా బాబూ!
అసలు ఈ ఉల్లిపాయ జ్వరం సంగతి ఏంటీ అంటే… ఉల్లిపాయలో మనకు తెలియని కొన్ని రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన సమయంలో మన శరీరంలో ఉండే రక్షణ దళం రంగంలోకి దిగి ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. శరీరంలోకి ఏదో ప్రవేశించిది అని గ్రహించి రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఇక జ్వరం ఎందుకు వస్తుంది అంటే… మన మెదడు కిందిభాగంలో ఉండే హైపోథాల్మ్ స్ అనే గ్రంధి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
శరీరంలోకి సూక్ష్మ జీవులు గాని ,బ్యాక్టీరియా గాని ప్రవేశించినప్పుడు శరీరం ఉష్ణోగ్రతను పెంచమని ఈ గ్రంధి ఆదేశాలు ఇస్తుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత పరిగి జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఉల్లిపాయకు సాధారణంగా బ్యాక్టీరియను ఆకర్షించే శక్తి ఎక్కువ. ఉల్లిపాయలో ఉండే రసాయనాలు వల్ల శరీరం లోకి ఏదో వచ్చిందని గ్రహించి శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత కారణంగా శరీరంలోకి ప్రవేశించిన జీవుల మనుగడ అనేది దాదాపుగా సాధ్యం కాదు. అయితే ఉల్లిపాయ ద్వారా వచ్చిన జ్వరం ఎక్కువ సమయం ఉండదు.
Also Read:ఉపరాష్ట్రపతి ఎన్నిక.. షెడ్యూల్ విడుదల