పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తేనే ఫ్యాన్స్ గోల చేస్తారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా చురుకుగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్.
అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే… పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటిభార్య నందిని వైజాగ్ కి చెందిన అమ్మాయి. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి స్వయంగా ఈ పెళ్లి చేశారు. అయితే ఏడాదికే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరమైపోయారు. ఆ తర్వాత బద్రి జానీ సినిమాలో నటించిన హీరోయిన్ రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీ టైం లో వీరి పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరు కూడా విడిపోయాడు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
చిరు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అర్జున్ ఎలా ఉన్నాడో తెలుసా?
ఇక మూడవ పెళ్లి రష్యా కు చెందిన అమ్మాయి ని చేసుకున్నాడు. తీన్మార్ సినిమాలో తనతో ఓ సీన్ లో నటించింది ఈ అమ్మాయి. అక్కడ వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నారు. 2011 నుంచి కూడా ఈ ఇద్దరు సహజీవనం చేయగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుమారుడి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్, అలాగే కుమార్తె పేరు పోలెనా అంజనా పవనోగా పెట్టారు.
నయనతార తల్లి అందుకే పెళ్లికి రాలేదా? ఇంత జరిగిందా!!
పెళ్లికి ముందు క్రిస్టియన్ అయిన అన్నాలెజ్నోవా పెళ్లి తర్వాత పూర్తి హిందువుగా మారిపోయింది. కట్టుబొట్టుతో సాంప్రదాయబద్దంగా అందర్నీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాకు మాత్రం దూరంగా ఉంటుంది. ఇకపోతే ఆస్తుల విషయానికి వస్తే ఈమె పేరుతో ఏకంగా 1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరు ను కొంటు వస్తుండగా… మోడల్ గా ఉన్నప్పుడు మరి కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. అలాగే అప్పట్లో కొన్న ఆస్తులు ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయాయి.