కొందరి జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. సినిమా వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు అంటే ఫాన్స్ కి ఇష్టమే. ఇక సావిత్రి, ఎన్టీఆర్ వంటి నటులకు సంబంధించిన అనేక విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తాజాగా సావిత్రికి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ అవుతుంది. ఆమె… మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత వారం రోజులు అన్నం మానేసారట.
ఆమెకు రాజకీయాలు అంటే ముందు నుంచి ఇష్టమే. ఇక ప్రభుత్వాలకు ఆమె పలు మార్లు సహాయ సహకారాలు అందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక జవహర్ లాల్ నెహ్రూని ఆమె ఎంతగానో ఇష్టపడేవారు. ఆయనను ఆమె కలిసినప్పటి ఫోటోలు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక జవహర్లాల్ నెహ్రూ 1964 లో మే 27న ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.
ఈ విషయం తెలిసిన తర్వాత సావిత్రి చాలా భావోద్వేగానికి గురి కావడమే కాకుండా వారం రోజుల పాటు అన్నం కూడా మానేశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె తెలిపారు. చెన్నైలో ఉన్న వాతావరణానికి అక్కడ గులాబీ పూలు ఎక్కువగా వచ్చేవి కాదని… హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలో ఉన్నా ఆమె ఇంటి ముందు భాగం ఒక పోర్షన్ అంతా కూడా నెహ్రూ గారి జ్ఞాపకార్థం గులాబీ పూల మొక్కల్ని పెంచారని… వాటిని చూస్తూ నెహ్రూ గారి గురించి మాట్లాడారు అని ఆమె తెలిపారు.