తమిళ స్టార్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా సరే మళ్ళీ నిలబడుతూ కెరీర్ లో కష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ లు కూడా చేయడానికి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అవి ఏంటీ అనేది చూస్తే… మా పేరెంట్స్ ను సంతోషంగా ఉంచుతున్నానని పేర్కొన్నాడు.
తమ కుమార్తె దియా కూడా పెద్దైన తర్వాత మమ్మల్ని చూసి గర్వంగా ఫీలవుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నాడు. అలాగే జ్యోతికకు భర్తగా ఉండటం ఆనందాన్ని ఇస్తుందని సంతోషం వ్యక్తం చేసాడు. తన పాపకు మంచి తండ్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నానని అన్నాడు. తాను స్కూల్ లో ఉన్న సమయంలో లేట్ కామర్స్ ఇన్ఛార్జ్ లీడర్ గా ఉండేవాడినని గుర్తు చేసుకున్నాడు. అయితే తాను స్కూల్ కు లేట్ గా వచ్చేవాడినని వివరించాడు.
లయోలా కాలేజ్ లో కామర్స్ డిగ్రీ చదివే సమయంలో విజయ్ నా క్లాస్ మేట్ అని సూర్య నేను, విజయ్ ఒకే బేంచ్ లో కూర్చునేవాళ్లమని సూర్య ఒక సంచలన విషయం బయట పెట్టాడు. కాని విజయ్ చివరి వరకు తనతో లేడు అని అప్పటి విషయాలు పంచుకున్నాడు. తాను చెన్నై కేంద్రంగా పని చేసే కంపెనీలో మర్చెండైజర్ గా జాబ్ చేశానని పేర్కొన్నాడు. తాము చాలా దేశాలకు షర్ట్స్ ఎక్స్ పోర్ట్ చేసేవాళ్లమని తెలిపాడు.