ఒకప్పుడు తరుణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా తక్కువ కాలంలోనే ఆయన మంచి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో తరుణ్ కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకి వెళ్ళింది. ముఖ్యంగా అమ్మాయిల్లో అతనికి చాలా బాగా ఫాలోయింగ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని తరుణ్ సైలెంట్ అయిపోయాడు. తరుణ్ తర్వాత వచ్చిన వాళ్ళు హీరోలు అయిపోయారు.
వాళ్ళు ఇప్పుడు స్టార్ ఇమేజ్ కూడా తెచ్చుకుని సినిమాలు చేస్తున్నారు. కాని తరుణ్ మాత్రం వ్యాపారాలు చేసుకుంటూ కెరీర్ లో ముందుకి వెళ్తున్నాడు. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే దానిపై చాలా మందిలో సందేహం ఉంది. అయితే తరుణ్ కి ఒక హీరోయిన్ తో పెళ్లి కావాల్సిందని కొన్ని కారణాలతో ఆగిపోయింది అంటారు. అసలు ఆ మేటర్ అనేది ఒకసారి చూద్దాం. తరుణ్… ప్రియమణి తో కలిసి సోగ్గాడు అనే సినిమా చేసాడు.
ఈ సినిమాలో ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి ఫాన్స్ కి. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయం తెలియడంతో తరుణ్ తల్లి రోజా రమణి ఆ షూటింగ్ జరిగే సమయంలో సెట్ కి వెళ్లి… మీ ప్రేమ నిజం అయితే పెళ్లి చేస్తాను అని అన్నారట. కాని అవన్నీ రూమర్స్ అని మీరు చెప్పే వరకు తనకు తెలియదని ప్రియమణి అన్నారట. అప్పట్లో ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. కాగా తరుణ్… ఆర్తి అగర్వాల్ ని ప్రేమించాడని తల్లికి ఇష్టం లేదనే దూరం అయ్యాడని అంటారు.