బ్రహ్మానందం వరుసగా సినిమాలు చేసిన సమయంలో ఒక తిట్టు బాగా ఫేమస్ అయింది. తెలుగు బాషలో ఎక్కడా లేని ఆ పదాన్ని బ్రహ్మీ వాడటం, దానికి మంచి క్రేజ్ రావడం, ఆ తిట్టు మీదనే ఒక సినిమా రావడం కూడా జరిగాయి. ఆ పదమే జఫ్ఫా… అసలు జఫ్ఫా అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఆ మాటకు మంచి చరిత్ర ఉంది.
Also Read:సినిమాల్లో సెంచరీ కొడతానంటున్న హన్సిక
జఫ్ఫా అనేది ప్రాచీన ఓడరేవు పట్టణానికి పెట్టిన పేరు. యాఫేత్ / జాఫేత్ అనే వ్యక్తి హీబ్రూ ప్రవక్త నోవా ముగ్గురు కొడుకులలో ఒకడు. ఈ పట్టణాన్ని స్థాపించాడు కాబట్టి ఆ పేరు పెట్టారు. యాఫేత్ / జాఫేత్ అంటే ఆరామిక్ భాషలో కొనసాగింపు అని అర్ధం. హీబ్రూ భాషలో అందం అని అర్ధం వస్తుంది. మానవాళికి కొనసాగింపు పట్టణంగా జఫ్ఫా అని నమ్మే వారు. అది ఇప్పటికి కూడా ఒక అందమైన పట్టణం.
ఈ పట్టణానికి ఎంతో చారిత్రిక మరియు ఇతిహాసిక ప్రాముఖ్యత ఉందని చరిత్ర కారులు చెప్తున్నారు. ముఖ్యంగా… యవ్వన, యూదు , ఐగుప్తు పురాణాలలో జఫ్ఫా పట్టణం గురించి అనేక చోట్ల ప్రస్తావించారు. ఇక జఫ్ఫా పేరుతో స్వీట్ కూడా ఉంది. ప్రముఖ ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ మిఠాయి. ఎరుపు, నారింజ కలర్ తో ఉంటుంది. చిన్న, రౌండ్ చాక్లెట్ బాల్స్‌తో ఉంటుంది. ఈ స్వీట్ కి జఫ్ఫా ఆరెంజ్ పేరు పెట్టారు. 1931 లో దీన్ని ఉత్పత్తి చేశారు.
అలాగే జెఫ్ఫా ఆరెంజ్స్ అని విత్తులు తక్కువ మొత్తంలో ఉండే లేదంటే అసలు విత్తులు లేనటువంటి నారింజలు. మధ్యధరా ప్రాంతంలో ఇవి పండుతాయి. మన తెలుగు సినిమాలలో జఫ్ఫా అనే పదం వీటి నుంచి వచ్చి ఉంటుంది. ఇక జఫ్ఫాకు దీని బట్టి అర్ధం చూస్తే… లైంగిక సక్రియత లేని వాడు అని అర్ధం అని అంటున్నారు.
Also Read:మెగా ఫ్యాన్స్.. మీకో దండం..ట్రోలింగ్ తట్టుకోలేక దిగివచ్చిన నారాయణ!