బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్షయ్ ఎక్కడికి వెళ్లినా వేలాది మంది అభిమానులు ఆయన్ను చూడటానికి వస్తారు. అక్షయ్ కుమార్ తన ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రతిసారీ కూడా అభిమానులు చుట్టుముడుతూ ఉంటారు. అక్షయ్ బయటకు వచ్చిన ప్రతీసారి మనకు శ్రేసే థెలే అనే వ్యక్తి కనపడుతూ ఉంటాడు. అతను ఈ బాలీవుడ్ స్టార్ హీరో కి సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు.
తన బాడీ గార్డ్ మీదున్న ప్రేమతో అక్షయ్ తాను చేసే ప్రతీ సినిమాలో ఏదోక పాత్ర ఇస్తూ ఉంటాడు. అక్షయ్ కుమార్‌కు భద్రతను అందించడంతో పాటు… శ్రేసే థెలే అప్పుడప్పుడు కుమార్ కుమారుడు ఆరవ్ భద్రత కూడా చూస్తాడు. అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్‌కు ఏటా రూ .1.2 కోట్లు చెల్లిస్తారు అని ఒక ప్రముఖ వెబ్ సైట్ పేర్కొంది. అక్షయ్ కుమార్ లాగానే, సల్మాన్ ఖాన్ కూడా బాడీ గార్డ్ కూడా మనకు ఎక్కువగా వినపడుతూ ఉంటుంది.
షెరా సల్మాన్ కు బాడీ గార్డ్ గా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ తో పని చేయడానికంటే ముందు షెరా గతంలో మైఖేల్ జాక్సన్, విల్ స్మిత్, పారిస్ హిల్టన్ మరియు జాకీ చాన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చినప్పుడు వారి భద్రతలో ఉన్నారు. ఒక యుట్యూబ్ వీడియోలో షెరా… సల్మాన్ తో పరిచయం గురించి మీడియాతో పంచుకున్నాడు. హాలీవుడ్ హీరో కీను రీవ్స్ ఇండియా వచ్చినప్పుడు తాను సల్మాన్‌ను కలిశాను అని చెప్పాడు.