టాలీవుడ్ లో స్టార్ హీరోతో అవకాశం వస్తే చాలు హీరోయిన్లకు పండగే అని అంటారు. అయితే కొందరు హీరోయిన్లకు మాత్రం ఎన్ని అవకాశాలు వచ్చినా సరే అద్రుష్టం మాత్రం పెద్దగా కలిసి రావడం లేదు. అందులో తమన్నా ఒకరు అనే చెప్పాలి. హ్యాపి డేస్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది గాని హిట్ లు మాత్రం రాలేదు.
ప్రభాస్
ప్రభాస్ తో ఆమె రెబల్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా అనుకున్న విధంగా ఫలితం ఇవ్వలేదు. నిర్మాతకు మాత్రం భారీ నష్టాలు మిగిల్చింది అనే చెప్పాలి.
ఎన్టీఆర్
ఎన్టీఆర్ తో ఊసరవెల్లి అనే సినిమాలో నటించింది తమన్నా. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి గాని సినిమా అనుకున్న విధంగా హిట్ కాలేదు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ తో ఆమె చేసిన బద్రీనాథ్ అనే సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమాలో ఆమె గ్లామర్ కు మంచి మార్కులే పడినా సినిమా హిట్ కాలేదు.