మన తెలుగు సినిమాల్లో లిప్ లాక్ అంటే చాలు హీరోలు, హీరోయిన్లు ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఈ విషయంలో కాస్త భయం భయంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో హీరోలు ధైర్యం చేస్తున్నారు. హీరోయిన్ లు కూడా మొహమాట పడటం లేదు.
ఒక హీరోయిన్ అయితే తన సినిమాల్లో లిప్ లాక్ గాని రోమాన్స్ సన్నివేశాలు గాని ఉంటే ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఆమె ఎవరో కాదు… నాగ చైతన్యతో మజిలీ సినిమాలో నటించిన దివ్యాంశ కౌశిక్. ఆ సినిమాలో చైతూతో మంచి రోమాన్స్ చేసింది అనే చెప్పాలి. లిప్ లాక్ లో మరింత రెచ్చిపోయి నటించింది అనే కామెంట్స్ వచ్చాయి.
ఇటీవల రవితేజా హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటి సినిమాలో సందడి చేసింది. ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైకేల్ సినిమాలో కూడా ఆమె రోమాన్స్ నే నమ్ముకుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో లిప్ లాక్ ఉంది. దీనితో ఈ హీరోయిన్ లిప్ లాకుండా నటించడం కష్టమే అనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా తర్వలోనే విడుదల కానుంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు