ఒక కుక్కను కాపాడటం కోసం ముగ్గురు చిన్నారులు చూపిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కుక్కను కొండచిలువ చెరనుంచి బయటపడేసేందుకు వీరు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేశారు. తమకు దొరికినవన్నీ వాటిపై విసిరారు. రాళ్లతో కొట్టారు. అంత పెద్ద కొండచిలువకు ఏమాత్రం భయపడకుండా ధైర్య సాహసాలను కనబర్చారు. చివరకు ఒకరు కొండచిలువ తలను ఒడుపుగా పట్టుకున్నారు. మరొకరు దాని తోకను పట్టాడు. ఇంకొకరు కుక్కను చాలా జాగ్రత్తగా దాని నుంచి విడదీశారు. కొండచిలువ పట్టు నుంచి తప్పుకున్న కుక్క ఒక్కసారిగా అక్కడి నుంచి దూకి పరుగుపెట్టింది.
These kids are way tougher than I am. Not all heroes wear capes.? The things we do for our dogs, bruh…??? pic.twitter.com/25xei1sLVw
— Rex Chapman?? (@RexChapman) September 26, 2019