ప్రగతి భవన్‌లో కుక్క పిల్ల చచ్చిపోతే కేసు పెట్టారు సరే, మరి తెలంగాణ జిల్లాల్లో విష జ్వరాల బారీన పడి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. యూరియా క్యూలో నిలబడలేక బక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి వీటిపై కేసులు ఎవరు పెడతారు?
హైదరాబాద్: ప్రగతిభవన్‌కు చెందిన హస్కీ అనే 11 నెలల కుక్కపిల్ల వైద్యం వికటించి మృతి చెందింది. యానిమల్ కేర్ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అధికారులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కుక్కపిల్ల అనారోగ్యంతో ఉండటం వల్ల బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4లోని యానిమల్ కేర్ సెంటర్‌కు ప్రగతి భవన్ అధికారులు తీసుకెళ్లారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లే కుక్కపిల్ల మృతి చెందిందని వైద్యుడు, కేర్ సెంటర్ నిర్వాహకురాలిపై అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు.