శునకం విశ్వాసానికి మారు పేరు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషికంటే ఇవి వందరెట్లు మేలు. కొన్ని విషయాల్లో మనిషి కంటే తెలివిగా, గొప్పగా ఆలోచిస్తాయి, ప్రవర్తిస్తాయి. చాలా ఎమోషనల్ కూడా.
తన యజమాని ఆపదలో ఉందని తెలిసి మనిషికి కంటే మిన్నగా ఓ పెంపుడు కుక్క ఆసరాగా నిలిచింది. ఈ వీడియోలో మహిళ మూర్ఛతో కిందపడగా ఆమె తల నేలకు కొట్టుకోకుండా కుక్క స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోను ది ఫైజెన్ ట్విట్టర్‌లో షేర్ చేయగా ఇప్పటివరకూ 40 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వైరల్ వీడియోలో మహిళ మూర్ఛతో బాధపడుతుండగా ఆమె కుప్పకూలి తల నేలకు కొట్టుకోవడం కనపిస్తుంది.
ఇదే సమయంలో మహిళ పరిస్ధితిని గమనించిన కుక్క ఆమెను తేరుకునేలా ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం సఫలం కాకపోవడంతో మహిళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుక్క ఆమె తల కిందకు చేరి కుషన్‌లా మారుతుంది.
మూర్ఛకు గురికాగా యజమానురాలి తలను కాపాడిన శునకం..కుక్కలు బెస్ట్ ఫ్రెండ్స్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. కామెంట్స్ సెక్షన్‌ను యూజర్లు లవ్ ఎమోజీలతో నింపేశారు.
The dog protecs his owner's head when she has a seizure!
Dogs are best friends! ❤️pic.twitter.com/3A9ONBpIvQ— The Figen (@TheFigen_) March 1, 2023