మహారాష్ట్ర డోంబివ్లీ ఘటనలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. బాధితురాలిపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు నిందితులు. అత్యాచారానికి ముందు డ్రగ్స్, మద్యం తాగాలని బాలికను బలవంతం చేసినట్లుగా తెలిపారు పోలీసులు.
థానే జిల్లాలోని డోంబివ్లీలో 15 ఏళ్ల బాలికపై 33 మంది అత్యాచారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు 8 నెలలుగా ఈ ఘోరం సాగింది. ముందుగా జనవరి 29న అదే ప్రాంతానికి చెందిన అబ్బాయి ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్నాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. మళ్లీ ఫిబ్రవరి 21న ఇంకోసారి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో కూల్ డ్రింక్ లో తెల్లటి పౌడర్ లాంటిది కలిపాడని బాధితురాలు పోలీసులకు వివరించింది.
తనపై అత్యాచారం చేసిన 33 మందిలో చాలామంది డ్రగ్స్, మద్యం తాగించినట్లు వాపోయింది బాధితురాలు. కొందరు హుక్కా కూడా తాగించారని తెలిపింది. పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అరెస్టైన వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు.