లాక్ డౌన్ కారణంగా పనులు లేక కొందరు, పనిమనుషులు లేక కొంత మంది ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కట్టడికి కోసం గత 45 రోజులుగా లాక్ డౌన్ పాటిస్తున్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. సకలం బంద్ అయ్యాయి. ఇంట్లో పనిమనుషులను కూడా రా నివ్వొద్దని ప్రభుత్వం ప్రకటించింది. చాలా మంది కరోనా వైరస్ కు భయపడి పనిమనుషులని రానివ్వలేదు. లాక్ డౌన్ కేవలం 3 వరాలు మాత్రమే ఉంటుంది అనుకోని అందరు తమ ఇండ్లలో పనులు వాళ్లే చేసుకున్నారు కానీ లాక్ డౌన్ పొడిగించడం తో ఇంట్లో పనులు చేసుకోవడం ఇబ్బంది గా మారింది. చాలా పెద్ద వయస్సు వాళ్ళు అన్ని పనులకు పనిమనుషులు పై ఆధారపడి ఉంటారు. నెలల తరబడి పనిమనుషులు లేక ఇంటి పనులు చేసుకోవడం ఇబ్బంది గా మారింది. కరోనా కాస్త తగ్గుమొఖం పట్టింది. పనిమనుషులని రమ్మని పిలుద్దాం అన్నా చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. తిరిగి వద్దాం అంటే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.
ఇండ్లలో పనిచేసే వాళ్ళు కూడా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. పనిచేస్తే కానీ జీతం రాదు. పని లేకుండా హైదరాబాద్ లో బ్రతకాలేము అని ఏదో రకంగా సొంత ఊర్లోకి వెళ్లిపోయారు. లాక్ డౌన్ పొడిగిస్తుండడం తో తిరిగి హైదరాబాద్ రాలేక, ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిమనుషులని ఏండ్లలోకి రనివ్వొచ్చు అని కేంద్రం చెప్పిన కూడా కొందరు భయపడుతున్నారు.