నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి స్టాక్ మార్కెట్లు. ఉక్రెయిన్, రష్యాల యుద్ధం వాతావరణంతో పాటు..అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు అందుకు కారణమంటున్నారు నిపుణులు. దీంతో మదుపర్లపై తీవ్ర ప్రభావం పడుతోందంటున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం సెన్సెక్స్ 1881 పాయింట్లు కోల్పోయి.. 55,350కి పతనమైంది. నిఫ్టీ 552 పాయింట్లు కుప్పకూలి 16,510కి పడిపోయింది.
దేశీయ మార్కెట్లలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ షేర్లు అత్యధికంగా 5.91శాతం నష్టపోయినట్టు తెలుస్తోంది.
భారతీ ఎయిర్ టెల్, టెక్ మహీంద్ర, ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్ షేర్లు నాలుగు శాతానికిపై కుప్పకూలినట్టు నిపుణులు వెల్లడించారు.