కరోనా వైరస్ అగ్ర రాజ్యం అమెరికాను చిగురుటాకులా వణికిస్తుంది. లక్షలాది మరణాలతో అమెరికా ఇప్పట్లో కరోనా వైరస్ దెబ్బకు కోలుకునే అవకాశం లేదు. దీంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న అమెరికా… కచ్చితత్వం ఉందనుకున్న వ్యాక్సిన్ తయారీ దారులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నాయి.

వ్యాక్సిన్ ఎలాగైనా తమ దేశ ప్రజలకే ముందుగా దక్కాలన్న ఉద్దేశంతో వరుసగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. తాజాగా అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ మెడెర్నాతో మరో కీలక ఒప్పందం చేసుకున్నారు. దాదాపు 1.5బిలియన్ల డాలర్ల ఈ ఒప్పందంలో భాగంగా మెడెర్నా కరోనా టీకాకు అనుమతి రాగానే 100మిలియన్ డోసులను అమెరికా పౌరులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఇతరులకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు అధ్యక్షుడు ట్రంప్.
ఒక్క అమెరికానే కాదు చాలా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ సక్సెస్ అవుతుంది అనుకున్న అన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అమెరికా మెడెర్నా కరోనా టీకా సెప్టెంబర్ లో ఫేజ్-3 ట్రయల్స్ పూర్తి చేసుకోనుంది.