ప్రపంచానికి పెద్దన్నగా, రారాజుగా వెలుగొందుతున్న అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు ఓ పసికూన సహాయం చేయాల్సి వస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దాటికి అమెరికా కాకవికాలం అవుతోంది. వేలాది కొత్త కేసులు నమోదయ్యాయి. కేవలం లంకె ఒక్కరోజులో 10వేల కొత్త కేసులు వచ్చాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు విడిచారు. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది.
దింతో అమెరికా దక్షిణ కొరియా సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. నిజానికి వూహన్ పట్టణంలో కరోనా వైరస్ బయటపడటంతో దక్షిణ కొరియా కూడా ఉలిక్కిపడింది. దక్షిణ కొరియాలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ప్రళయం తమ వైపుకు ముంచుకొచ్చే సమయానికే దక్షిణ కొరియా అప్రమత్తం అయ్యింది. కరోనా వైరస్ టెస్ట్ కిట్స్ ను తయారు చేసుకొని, ఒక్కరోజులోనే పరీక్ష ఫలితాలు వచ్చేలా రెడీ అయ్యాయి. అంతేకాదు ఓ చోట కరోనా పాజిటివ్ నమోదైతే చాలు… ఆ చుట్టూ ఉన్నవారికి మేసేజ్ వెళ్లిపోయేలా, రక్షణ చర్యలు చేపట్టారు. ప్రజలకు విరివిగా పరీక్షలు చేస్తూ…. 50వేల వరకు కేసులు నమోదైనా కేవలం 125మంది మాత్రమే అక్కడ చనిపోయారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తి కంట్రోల్ లో ఉంది.
దింతో అమెరికా సహాయం కోరడంతో… దక్షిణ కొరియా కూడా సానుకూలంగా స్పందించినట్లు కథనాలు వినిపిస్తున్నాయి.