ఎల్లుండి నుంచి రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశంలో మత స్వేచ్ఛపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడనున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భారత ప్రజాస్వామిక సాంప్రదాయాలపై అమెరికాకు గొప్ప గౌరవం ఉందని తెలిపింది. ” అమెరికా, భారత్ లో ఉన్న ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, మత స్వేచ్ఛపై అధ్యక్షుడు ట్రంప్ బహిరంగ సభలోను, ప్రైవేట్ గాను మాట్లాడతారు…ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. ముఖ్యంగా మత స్వేచ్ఛ గురించి…ఈ పాలకులకు ఇది అత్యంత ముఖ్యమైనది” అని కాన్ఫరెన్స్ కాల్‌లో వైట్ హౌస్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రస్తుతం భారతదేశంలో వివాదస్పదంగా మారిన సీఏఏ, ఎన్.ఆర్.సి ల గురించి అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానితో మాట్లాడే ప్లాన్ ఏమైనా ఉందా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు వైట్ హౌస్ అధికారులు స్పందించారు.
”అఫ్ కోర్స్…మత స్వేచ్ఛ అనేది ఇది భారత రాజ్యాంగంలోనే ఉంది…మతపరంగా ఉన్న మైనార్టీలను గౌరవించడం…అన్ని మతాలను సమానంగా చూడడం రాజ్యాంగంలోనిదే… అందుకే అధ్యక్షుడికి అది ముఖ్యమైనది..తప్పకుండా ఆ విషయం ప్రస్తావనకు వస్తుందనుకుంటాను” అని వైట్ హౌస్ సీనియర్ అధికారి తెలిపారు. ఇండియా బలమైన ప్రజాస్వామిక పునాధి కలిగినది…విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులతో కూడినది…నిజానికిది ప్రపంచంలోని నాలుగు పెద్ద మతాలకు పుట్టినిల్లు అన్నారు.
”గత ఏడాది గెలిచిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి సారిగా మాట్లాడుతూ…ఇండియాలో మతపరమైన మైనార్టీలను కలుపుకుపోయేందుకు ఏ విధంగా ప్రాముఖ్యత నిస్తున్నారో చెప్పారు. అందుకే చట్టం ప్రకారం ఇండియా అన్ని మతాలకు సమానత్వం, స్వేచ్ఛ కల్పిస్తుందా..? లేదా? అనే విషయాన్ని ప్రపంచం గమనిస్తుంది అని సీనియర్ అధికారి చెప్పారు.