అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్టుగా ఎలక్టోరల్ కాలేజీ అధికారికంగా ధ్రువీకరిస్తేనే తాను వైట్‌హౌస్ నుంచి తప్పుకొని వెళ్లిపోతానని ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. జనవరి 20న బిడెన్‌ను పాలనకు ముందు కాలానికి మాత్రమే తాను సేవ చేస్తానని తెలిపారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరిస్తే వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోతారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ట్రంప్.. తప్పకుండా చేస్తాను అంటూ సమాధానం ఇచ్చారు.. అయితే జనవరి 20వ తేదీ లోపు చాలా పరిణామాలు జరగవచ్చని తాను భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే వైట్‌హౌస్ విజేత ఎవరో నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజ్.. డిసెంబర్ 14న బిడెన్ విజయాన్ని నిర్ధారించేందుకు సమావేశం కానుంది. తాజా ఎన్నికల్లో ట్రంప్ 232, బిడెన్‌కు 306 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలను ట్రంప్ అంగీకరించడం లేదు. పోలింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన కోర్టులను ఆశ్రయించారు.