అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ రాసిన లేఖలో ఏముందో అప్పుడే చెప్పలేనని అన్నారు కొత్త అధ్యక్షుడు జోబైడెన్. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఓవల్ ఆఫీసుకు వచ్చిన జోబైడెన్.. రిజల్యూట్ డెస్క్‌లో ట్రంప్ వదిలిపెట్టి వెళ్లిన లేఖను ఆయన చదివారు. ట్రంప్ రాసిన లేఖ సౌమ్యంగానే ఉందన్నారాయన. అయితే అందులోని వివరాలను చెప్పేందుకు ఇష్టపడలేదు. ట్రంప్ తనకు రాసిన లేఖ వ్యక్తిగతమని.. ఆయనతో మాట్లాడిన తర్వాతే అందులోని వివరాలను చెప్తానని అన్నారు బైడెన్. అయితే లేఖ మాత్రం ఉదాత్తంగానే ఉందని స్పష్టం చేశారు.అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులకు.. ఆ పదవి నుంచి వైదొలిగే వారు లేఖలు రాసి వెళ్లడం ఏళ్లుగా ఓ సాంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ కూడా జోబైడెన్‌కు లేఖ రాశారు. ఇక మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా కొత్త వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌కు లేఖను రాశారు.