ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీకి విరాళాలు భారీగా పెరిగాయి. 2020-21 లో ఈ పార్టీకి రూ. 477.5 కోట్ల విరాళాలు అందగా.. 2021-22 లో ఇది రూ. 614.5 కోట్లకు..అంటే 28.7 శాతం పెరిగినట్టు వెల్లడయింది. వ్యక్తులు, కార్పొరేట్లు, ఇతర ట్రస్టుల ద్వారా మొత్తం పెరిగిన విరాళాలు 79 శాతం షేర్ వరకు ఉన్నాయట. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్థితి మాత్రం అధ్వాన్నంగా ఉంది. ఈ పార్టీకి 12 శాతం మాత్రమే విరాళాలు అందాయి.
బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, బహుజన్ సమాజ్ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ తమకు అందిన డొనేషన్స్ తాలూకు తాజా వివరాలను ఎన్నికల కమిషన్ కి అందజేశాయి. ఇవన్నీ మొత్తం రూ. 778.7 కోట్లు ఉన్నాయి. అయితే సీపీఐ ఇంకా తన విరాళాల వివరాలను ఈసీకి అందజేయలేదు.
2019-20 తో పోలిస్తే 2020-21 లో జాతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాల సంఖ్య 41 శాతం తగ్గిందట. 2019-20 లో రూ. 1,015 కోట్ల విరాళాలు అందగా 2020-21 లో 592 కోటు మాత్రం అందినట్టు తెలిసింది. అయితే సీపీఐని లెక్కలోకి తీసుకోకున్నా 20-21,20-22 లో కొంత మేర ఇవి పెరిగినట్టు ఈసీ వర్గాలు తెలిపాయి.
బీజేపీకి డొనేషన్స్ ఇచ్చిన సంస్థల్లో ప్రుడెంట్ ఎలెక్టోరల్ ట్రస్ట్, భారతి ఎయిర్ టెల్ గ్రూప్, యార్సెలర్ మిట్టల్ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్, సీరం ఇన్స్ టి ట్యూట్ వంటివి ఉన్నాయి. ఏబీ జనరల్ ఎలెక్టోరల్ ట్రస్ట్ ద్వారా బీజేపీకి సుమారు 10 కోట్ల విరాళాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే దీనికి 20-21 కన్నా 20-21 లో విరాళాలు సుమారు 28 శాతం పెరిగాయి. 20-21 లో ఈ పార్టీకి 74.5 కోట్లు అందగా 21-22 లో ఇది 95.5 కోట్లకు పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్ కి కేవలం 1 శాతం మాత్రమే డొనేషన్స్ అందాయట.