చెరుకు సుధాకర్ ఇంటిపార్టీ అధ్యక్షుడు
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వసతులను పరిశీలించా..ఉత్తర తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ వరకు వైద్య సేవలు అందిస్తున్న వరంగల్ ఎంజీఎం దవాఖానను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం బాధాకరం. పనిచేయడానికి సిబ్బంది ఉన్న వసతులు లేవు.. వనరులు లేవు…అధికార పార్టీ పేరుతో డాక్టర్ల పై దాడులు, బెదిరింపులు తగవు.
వైద్య సిబ్బంది రీక్యూటింగ్ లేకుండా కరోనా కట్టడి సాధ్యం కాదు. అలాంటి అబద్ధపు మాటలు మాని కట్టడి ఎలా చెయ్యాలో ఆలోచించండి. 6 ఉమ్మడి జిల్లాల దవాఖానలో 20 వెంటిలేటర్స్ మాత్రమే ఉండటం ఎంటి..?
కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఇంత తక్కువ జీతంతో పనిచేయించడం సరికాదు. వారికి 50 వేల బేసిక్ జీతం ఇచ్చి కోటి రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలి. డ్యూటీ డాక్టర్లు, నర్సులు పనిచేయడానికి భయపడే పరిస్థితులున్నాయి. కనీసం టాయిలెట్స్ లేవు కోట్ల నిధులు ఏమైతున్నయి. నిర్లక్షం ప్రభుత్వం వైపున ఉండి డాక్టర్లను ఇబ్బంది పెడితే రాజీనామాలు చెయ్యక ఎం చేస్తారు. కరోనా పరిస్థితుల్లో సాధారణ వైద్యం ఆగిపోయింది, ఆరోగ్య శ్రీ నడవటం లేదు. జిల్లాకో ఆసుపత్రి ఏర్పాటు చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. కరోనా పేరుతో కార్పొరేట్ దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. ఎక్కువ మోతాదులో టెస్టులు చెయ్యకుండా మిగితా రాష్ట్రలకన్న మెరుగైన పరిస్తులున్నయని ప్రజలను బ్రమల్లో ముంచకండి.