విజువల్ ఎఫెక్ట్స్ లో మార్పుల కారణంగా ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ ఇబ్బందుల్లో పడింది. టీజర్ లో గ్రాఫిక్స్ పై విమర్శలు చెలరేగడంతో, సినిమా విడుదలను సంక్రాంతి నుండి జూన్‌కి వాయిదా వేసింది టీమ్. అయితే.. ఇప్పుడు జూన్ కి కూడా డౌటే అనే టాక్ వినిపిస్తోంది.
తాజా అవుట్ పుట్ పై యూనిట్ పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయలేదంట. సో.. సరైన అవుట్ పుట్ రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే ఆదిపురుష్ విడుదల మరింత ఆలస్యం అవుతుంది.
ఈ చిత్రానికి గ్రాఫిక్స్ చాలా కీలకం. అవసరమైన పాజిటివ్ హైప్ తీసుకురావాలంటే గ్రాఫిక్స్ బాగుండాలి. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న పనితీరు చూస్తుంటే ఆదిపురుష్ అనుకున్నదాని కంటే ఎక్కువ సమయం తీసుకుంటాడనిపిస్తోంది. జూన్ 16 నుంచి సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం ప్రమోషనల్ ప్లాన్ సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా కీలకమైన నగరాల్లో దగ్గరుండి ప్రచారం చేయాలని నిర్ణయించారు. యూత్ ను ఆకట్టుకునే ప్రచారంతో పాటు, ఆధ్యాత్మిక భావం పెంపొందించి పెద్దల్ని కూడా థియేటర్లకు రప్పించాలనేది ప్లాన్. ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్.