దాదాపు 10 సంవత్సరాల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్, మహేష్ బాబు మల్టీ స్టారర్ చేయడంతో ప్రేక్షకులు కూడా సినిమాని బాగా ఆదరించారు.
ఈ చిత్రంలో అంజతి, సమంత కథానాయికలుగా నటించారు. ఇప్పటికీ ఈ సినిమాను బుల్లితెర మీద కూడా చాలా సార్లు ప్రసారం చేశారు. అయితే ఎన్ని సార్లు చూసినప్పటికీ ఈ సినిమాలో మాత్రం అనేక సందేహలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అవి ఏంటంటే… అసలు హీరోల ఇద్దరు పేర్లు ఏంటి?
ప్రకాశ్ రాజ్ రేలంగి మావయ్య గా నవ్వుతూ కనిపిస్తారు. కానీ ఆయన ఏ పని చేస్తాడు అనే దానిని సినిమాలో ఎక్కడ కూడా చూపించలేదు.అసలు వారు తినడానికి డబ్బులు ఎలా వస్తాయి అనే దాని మీద ఎప్పటికీ అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉంటాయి. ఒక సన్నివేశంలో చిన్నోడు పూల కుండీని తన్నుతాడు? అసలు ఎందుకు పూలకుండీని తన్నాడో అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
ఎవరు చెప్పకముందే సీతకి అన్ని తెలిసిపోతుంటాయి..? అంటే సీత ఏమైనా దైవ శక్తులు కలిగిన ఉన్న అమ్మాయా..?
సినిమాలో లాస్ట్ లో బామ్మకి అన్ని గాజులు ఎలా చేయించారు? అంటే ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయా? ఏం ఉద్యోగాలు వచ్చాయి?
అసలు గీతా, చిన్నోడు లవ్ స్టోరీ ఏంటి? ఇద్దరూ ప్రపోజ్ చేసుకున్నారా?
సినిమాలో సీత గీతకి తప్ప మిగిలిన ఎవరికి పేర్లు లేవా? రేలంగి మామయ్య అసలు పేరు ఏంటి? అసలు మిగిలిన వాళ్ళ పేర్లు ఏంటి?పెద్దోడు ఏం పని చేయకపోయినా డబ్బులు ఎలా ఇస్తాడు? అనే సందేహలు సినిమా చూసిన ప్రతి సారి కూడా ప్రతి ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్నలే…!!
Also Read: నటి హేమమాలిని సుమధుర గానం…!