ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేలా తీసుకున్న నిర్ణయాలను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అయితే.. ప్రయాణికుల కోసం వివిధ రైల్వే స్టేషన్ లలో ఫ్రీ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వేశాఖ.
అయితే.. అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసుకునేందుకు ఫ్రీ వైఫై ను వాడుతున్నారు కొందరు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఇందులో టాప్ పొజిషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నాంపల్లి, తిరుపతి రైల్వే స్టేషన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు రైల్వే టెల్ అధికారులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 6100పైగా రైల్వేస్టేషన్లలో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ. రైల్ టెల్ వీటి నిర్వహణను చూసుకుంటోంది. అయితే సిక్రిందాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు డౌన్ లోడ్ చేసుకుంటున్న వీడియోల్లో 35 శాతం ఆశ్లీల కంటెంట్ ఉంటున్నట్లు రైల్వేటెల్ అధికారులు గుర్తించారు.
Advertisements
వైఫై సెర్చ్ ల్లో ఎక్కువమంది పోర్న్ వీడియోల కోసం వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సదుపాయార్ధం ఏర్పాటు చేసిన అవకాశాలను అసాంఘిక కార్యకలాపాలకోసం వాడటం నేరం అంటున్నారు అధికారులు. అవసరం అయిన వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉందంటున్నారు.