ట్రైయినీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి ప్రేమ వ్యవహరంలో ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి ఏపీ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడంటూ భార్య భావన చేసిన ఫిర్యాదుతో గతంలో హోంశాఖ ట్రైనీ ఐపీఎస్‌గా ఉన్న మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ ఉత్తర్వులపై మహేశ్వర్ రెడ్డి క్యాట్‌ను ఆశ్రయించటంతో… క్యాట్‌లో మహేశ్వర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా ట్రైనీంగ్ పూర్తి చేసుకోవటంతో… కడప జిల్లాకే చెందిన మహేశ్వర్ రెడ్డికి సొంత రాష్ట్రానికే కేటాయిస్తూ డీవోపిటీ నిర్ణయం తీసుకుంది.
అయితే, భావన మాత్రం తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, తొమిదేళ్ల తమ ప్రేమలో ఏనాడూ కులం ప్రస్తావన తీసుకరాలేదని, కానీ ఇప్పుడు తక్కువ కులం పేరుతో అవమానిస్తూ, చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. పెళ్లి గురించి ఇంట్లో వాళ్లకు చెప్పమంటే… సెటిల్ అయ్యాక చెప్తానన్నాడని, కానీ ఐపీఎస్‌కు ఎంపికయ్యాక కట్నం పేరుతో, కులం పేరుతో వేధిస్తున్నాడని… నాది తక్కువ కులం కావటంతో ఇంట్లో ఒప్పుకోరని చెబుతున్నాడని భావన న్యాయ పోరాటం చేస్తోంది.