రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతపూర్ గ్రామంలో భర్త ఇంటి ముందు భార్యతో పాటు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. గత సంవత్సరం మార్చి నెలలో మల్కాజ్ గిరి నియోజకవర్గం అల్వాల్ ప్రాంతానికి చెందిన రిఖిత అనే యువతిని, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు.
అయితే వివాహ సమయంలోనే అల్వాల్ పరిధిలో ఉన్న కోటి రూపాయలు విలువ చేసే ప్లాట్ తో పాటు 25 తులాల బంగారాన్ని కూడా ఇచ్చారు. కానీ గత కొంత కాలంగా భర్త చంద్రశేఖర్ రెడ్డి మరింత అదనంగా వరకట్నం తేవాలని భార్య రిఖితాను వేధించసాగాడు.
దీంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి. భర్త పెట్టిన బాధలను బరించలేని రిఖిత పుట్టింటి వెళ్లి, జరిగిన సంగతంతా తల్లిదండ్రులకు చెప్పింది. భర్త చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి మాట్లాడుదామని రిఖిత కుటుంబ సభ్యులు సంతపూర్ వచ్చారు.
అయితే అప్పటికే భర్త ఫ్యామిలీ ఇంటికి తాళం వేసి వెళ్లి పోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటి వద్ద టెంట్ వేసుకొని ధర్నాకు దిగారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.