కరోనా వైరస్‌పై అనుమానాలున్నాయా…? మీ అనుమానాలు వెంటనే నివృతి చేసుకోండి. కరోనా బారిన పడకుండా మిమ్మల్ని, మీ కుటంబ సభ్యుల్ని, మీ తోటి వారిని కాపాడుకోండి.
కరోనా వైరస్‌పై జనంలో ఉన్న అనుమానాలకు ప్రముఖ వైద్యులు ఇస్తున్న సమాధానాలు ఇవే.
1. వేసవిలో కరోనా వైరస్ మనుగడ ఉంటుందా..?
అలా అనుకోవడానికి లేదు. మన దగ్గర వేసవి ఉంటే… ప్రపంచంలో మరో చోట చలికాలం ఉంటుంది. కాబట్టి కరోనా ఉన్నట్లే
2. దోమ కాటుతో కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందా…?
ఖచ్చితంగా లేదు. రక్తం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదు.
3.10 సెకన్ల పాటు గాలి పీల్చుకోవటం మానేస్తే కరోనా వైరస్ చనిపోతుందా…?
ఇది పూర్తిగా అవాస్తవం. ఊపిరి ఆపుకోవటం ఒక్కోక్కరిలో ఒక్కోలా ఉంటుంది.
4. కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే రక్తదానం చేస్తే సరిపోతుందా- వాళ్లు టెస్ట్ చేస్తారు కదా…?
ఇలాంటి పుకార్లే వద్దు అనేది. కరోనా వైరస్‌ను ఇలా గుర్తించలేరు.
5.కరోనా వైరస్ గొంతులో ఉంటుంది కనుక ఎక్కువగా నీరు తాగితే కడుపులో ఉన్న ఆమ్లాలతో వైరస్ చనిపోతుంది కదా…?
ఎక్కువగా నీరు తాగటం వల్ల కరోనా వైరస్ ఎక్కడికీ పోదు.
6. సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కరోనాను నిలుపుదల చేయవచ్చా…?
అవును చేయవచ్చు. ప్రతి ఒక్కరు తమకు తాము సోషల్ డిస్టెన్సింగ్ చేసుకోవటం ఉత్తమం
7. ఓ చిన్న ప్రమాదం జరిగితే వేల మంది చనిపోతారు. కరోనాకే ఎందుకు ఇంతలా భయపడుతున్నారు…?
దాని వల్ల వారు మాత్రమే చనిపోతారు. అది కేవలం ప్రమాదం మాత్రమే. కానీ ఇది అలా కాదు… ఇతరులకు వ్యాపిస్తూనే ఉంటుందని మర్చిపోకూడదు.
8.ప్రతి ఇంట్లో శుభ్రత పాటించటం వల్ల కరోనా రాకుండా చేసుకోవచ్చు కదా…?
కనీసం ఆరు ఫీట్ల దూరం ఉండటం, చేతులు శుభ్రం చేసుకోవటం వల్ల కరోనా నుండి భయటపడొచ్చు. ఇంట్లో కూడా ఒకరికన్నా ఎక్కువ మంది మనుషులుంటారు కదా….!