లక్ష్మణ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
మోడీ ముందు ముఖం చెల్లకే కేసీఆర్ బెంగళూరు వెళ్తున్నారు. సంప్రదాయాలను పాటించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ చర్యలు తెలంగాణ సమాజం గమనిస్తోంది.
ప్రధానిని ముఖ్యమంత్రి స్వాగతం పలికే ఆనవాయితీని కేసీఆర్ కాలరాశారు. రాష్ట్ర రైతులను వదిలేసి, ఇతర ప్రాంతాల రైతులకు డబ్బులు ఇస్తున్న ఘనత ఆయనకే దక్కుతుంది. ఇక్కడి ప్రజల ఆదాయాన్ని ఇతర రాష్ట్రాల వారికి సీఎం దారాదత్తం చేస్తున్నారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందటం ఖాయం.
Advertisements
ఎయిర్ పోర్టులో పార్టీ తరుఫున ప్రధానికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సమయంలో మోడీ ప్రసంగించే అవకాశం లేదు. ఒకవేళ మాట్లాడితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. మోడీకి స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు.